Homeజిల్లా వార్తలుఘనంగా జాతిపిత మహత్మ గాంధీ జయంతి వేడుకలు..!

ఘనంగా జాతిపిత మహత్మ గాంధీ జయంతి వేడుకలు..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో అక్టోబర్ రెండు సందర్భంగా జాతీపిత జయంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు హట్టహసంగా జరుపుకున్నారు. గాంధీజీ విగ్రహలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ముస్తాబాద్ లోని పాలకేంద్రం వద్ద గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు అధ్యక్షతన పార్టీ నేతలు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. విగ్రహనికి పూల మాలలు వేసి జోహర్లు తెలిపారు. గాంధీజీ చూపిన సన్మార్గంలో నడువాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన సర్వర్ పాష, పట్టణాధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మరెడ్డి, శీలం స్వామి, మెంగని మనోహర్, కొడే శ్రీనివాస్, నల్ల నర్సయ్య, కంచం నర్సింలు, దోరగల్ల బాలయ్య, అన్వర్ తదితరులు కలరు. అలాగే మేజర్ గ్రామపంచాయతీలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు గజ్జెల రాజు అధ్యక్షతన హస్తం పార్టీ నేతలు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహనికియ పూలమాలు వేసి నివాలర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశ స్వాత్ర్యం కోసం శాంతియుతంగా పోరాడిన మహ గొప్ప వ్యక్తి గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరు అహింస మార్గంలో నడువాలన్నదే ఆయనచ స్వప్నమన్నారు. ఆయన చూపిన మంచి బాటలో ప్రతి ఒక్కరూ నడువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, శివకేశవుల ఆలయ చైర్మన్ ఎల్సాని దేవయ్య, నాయకులు తలారి నర్సింలు, వెల్ముల రాంరెడ్డి, అరుట్ల మహేశ్ రెడ్డి, తాళ్ల విజయ్, రంజాని నరేశ్, ఉచ్చిడి బాల్ రెడ్డి, భాను, కొండల్ రెడ్డి, శీల ప్రశాంత్, అనిల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .

Recent

- Advertisment -spot_img