Homeజిల్లా వార్తలుమహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

ఇదే నిజం,గొల్లపల్లి : వెలివాడలకు అక్షర దారులు వేసిన క్రాంతి దర్శి,సామాజిక విముక్తి దేశంలో నిజమైన మహాత్ముడు,సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతిని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రములో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కోమల్ల జలంధర్ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజoలో అత్యధిక శాతంగా ఉన్న బలహీన వర్గాలు ఉన్నతంగా ఎదగాలని,సామాజిక,ఆర్థిక అసమానతలు ఉండకుండా అందరు చదువుకొని జ్ఞానవంతులుకావాలని అందుకోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు,మహాత్మాజ్యోతిబాపూలే అని ఈసందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఐతర వేణి మల్లయ్య,జగిత్యాల జిల్లా యూత్ ఉపాధ్యక్షులు బొండ్ల నాగరాజ్,బొండ్ల స్వామి,ఐతర వేణి రాకేష్,బోండ్ల రాజశేఖర్,పిట్టల గంగయ్య,ఐతర వేణి ఐతర వేణి మధు,ఎల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img