కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.