HomeసినిమాMahesh Babu : I learned many things from my father..! Mahesh Babu...

Mahesh Babu : I learned many things from my father..! Mahesh Babu : నాన్న నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా..!

మనం స్టార్‌ అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని హీరో మహేశ్‌ బాబు అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్‌, నమ్రత దంపతులు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకున్నారు. ‘నేను నటించిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందనప్పుడు నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలుంటాయి. దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను.

అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ ఫోకస్ పెడతాను. మనం స్టార్‌ హీరో అయినప్పుడు ఒత్తిడిని అంగీకరించాలి. ఈ విషయం నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం.. వంటి వాటి ప్రాముఖ్యతను ఆయనే నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదని ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటేగానీ వరిస్తుందని చెప్పారు’అంటూ మహేశ్‌ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img