Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 1500 కోట్లుతో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఏ డైరెక్టర్‌తో సినిమా తీస్తాడు అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్‌తో మహేష్ సినిమా చేయబోతున్నాడు అని సమాచారం. ”ఇంట్రస్టెల్లార్”, ”ఇన్సెప్షన్”, ”టెనెట్” వంటి అద్భుతమైన సినిమా తీసిన క్రిస్టొఫర్ నొలన్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
క్రిస్టొఫర్ నొలన్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే మహేష్ బాబుకి కూడా ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ కట్ అవుట్ చూస్తే హాలీవుడ్ హీరోలకు మించి ఉంటుంది. అయితే క్రిస్టొఫర్ నొలన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో ఒక సైన్స్ ఫిక్షన్ కధ రాశాడు. అయితే ఆ కధ కోసం ఇండియా హీరోని ఎంపిక చేసాడని తెలుస్తుంది. ఈ సినిమా కధకు మహేష్ బాబు సరిపోతాడు అని భావించిన క్రిస్టొఫర్ నొలన్ మహేష్ ను ఒకే చేసాడు. ఆల్రెడీ మహేష్ బాబుతో కధ చర్చలు కూడా పూర్తి అయ్యాయని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సినిమాని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి ఆ సినిమా షూటింగ్ లో మహేష్ బిజీ కాబోతున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా తన సత్త ఏంటో చూపించబోతున్నాడు. ఈ వార్త విని మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.