Homeహైదరాబాద్latest NewsMahesh Babu : మావోయిస్టుల ఆడాలో మహేష్ బాబు..!!

Mahesh Babu : మావోయిస్టుల ఆడాలో మహేష్ బాబు..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ”SSMB29” అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హీరోయినిగా ప్రియాంక చోప్రా నటించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మావోయిస్టుల ఆడా అయిన ఒడిస్సా లోని కోరాపుట్ లో జరుగుతుంది. ప్రస్తుతం రాజమౌళి సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ తీస్తున్నాడు.

ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా మారింది. 15 సంవత్సరాల క్రితం, ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేవి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ లు చేయడంతో పరిస్థితి అంతా మారిపోయింది. గతంలో ఇక్కడ ”పుష్ప-2”, ”సంక్రాంతికి వస్తునాం” ఇక చాలా సూపర్ హిట్ సినిమాల షూటింగ్ చేసారు. తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా కూడా జరగడంతో ప్రపంచ దృష్టి మొత్తం కోరాపుట్ జిల్లా వైపు పడింది. దీంతో లక్షలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్ భద్రతా కోసం దాదాపు 80 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసింది. ఒడిశా ప్రభుత్వం కూడా ఈ సినిమా షూటింగ్ చేయడానికి పూర్తి మద్దతును అందిస్తోంది. అయితే ఈ మావోయిస్టుల ఆడాలో మహేష్ బాబు సినిమా షూటింగ్ చేస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img