మహేష్ బాబు కొత్త లుక్ చూశారా.. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా.. మరి ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమేనా?. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో సక్సెస్ కొట్టి రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. సినిమా షూటింగ్ కు టైం ఉందో ఏమో..ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి స్విట్జర్లాండ్ వెళ్ళాడు మహేష్. అక్కడి నుండి మహేష్ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
మన సూపర్ స్టార్ ఒట్టో క్లాతింగ్ బ్రాండ్ అంబాసిడర్ . గతంలో కూడా ఈ బ్రాండ్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసి ఫొటోలు షేర్ చేసారు. తాజాగా మరోసారి మహేష్ బాబు ఒట్టో కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ లుక్ మహేష్ ఏజ్ పెరుగుతున్నా ఇంకా అదే అందం అని అంటున్నారు ఫ్యాన్స్.
పనిలో పనిగా మహేష్ కొత్త ఫోటోలు షేర్ చేస్తూ SSMB29 హ్యాష్ ట్యాగ్ కూడా ఇస్తుండటంతో రాజమౌళి, మహేష్ బాబు సినిమా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఇక రాజమౌళి, మహేష్ సినిమా ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.