సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు (ఆగస్టు 9) తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు పుట్టినరోజు సందర్బంగా #HBD మహేష్‌బాబు అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్‌మీడియాలో ట్రెండింగ్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఈ హాష్ ట్యాగ్ మొదటి స్థానంలో ఉంది. #HBDMaheshBabu అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం ద్వారా అభిమానులు రేపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా తమ ఉత్సాహాన్ని, ప్రేమను చాటుకుంటున్నారు. అయితే మహేష్ తన అభిమానులను ఉద్దేశిస్తూ ప్లాస్మా దానం చేయడమే తనకు వారు ఇచ్చే గొప్ప బహుమతి అన్నారు. తన పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ఇతర కార్యక్రమాలకు బదులు రక్తదానం చేయాలని సూచించారు. మహేష్ బాబు రాబోయే చిత్రం సర్కారు వారీ పాటలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.