హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు,మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనతో ధూలపల్లిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.