కొండాపూర్ లో భారి అగ్నిప్రమాదం సంభవించింది. కొండాపూర్ లోని గాలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు ఇంట్లో ఒకరు ఉన్నట్లు సమాచారం. అయితే మహిళ బాల్కనీలో ఉండటంతో ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని మహిళను కిందకు దిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.