Homeహైదరాబాద్latest Newsఎబివిపి బంద్ ను విజయవంతం చేయండి..

ఎబివిపి బంద్ ను విజయవంతం చేయండి..

ఇదే నిజం, దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొండమల్లేపల్లి శాఖ ఆధ్వర్యంలో ఎబివిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 26వ తేదీన బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. మంగళవారం రోజున కొండమల్లేపల్లి నగరంలో ఉన్నటువంటి పాఠశాలల యాజమాన్యాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యులు యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని మరియు పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు.

డిమాండ్స్:

  1. ప్రైవేటు, కార్పొరేట్, పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు లక్షలు ఫీజాలు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
  2. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి.
  3. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్ మరియు యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి.
  4. ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.
  5. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే డిఈఓ, ఎంఈఓ అధికారులను నియమించాలి.
  6. ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరపాలి.
  7. నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలి మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
  8. మెగా డీఎస్సీ ద్వారా 24 వేల’ పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.
  9. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి.
  10. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.

ఈ యొక్క పది డిమాండ్లు నెరవేర్చాలని 26 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థుల సమస్యలపై ఆలోచన చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది అని అన్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగాపెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలియజేస్తామని ఏబీవీపీ హెచ్చరిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, గణేష్, సైదులు, పవన్, అర్జున్, సింహాద్రి, రాము తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img