Homeహైదరాబాద్latest Newsవిజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి

విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయండి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెందోలి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించార. ముఖ్య అతిధుల పాల్గొన్న జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా గ్రామ గ్రామాన మాదిగ ఉప కులాల ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ నడిబొడ్డున దండోరా మోగించి, అలుపెరుగని పోరాటం చేసి, సుప్రీంకోర్టు ద్వారా న్యాయ ఫలితాన్ని అందించిన మందకృష్ణ మాదిగ ఈ నెల 13 హైదరాబాద్ వస్తున్న సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నందున ధర్మపురి నియోజకవర్గలో ఉన్న మాదిగ మరియు మాదిగ ఉపకులాల ప్రజలు భారీ సంఖ్యలు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దూమల గంగారాం మాదిగ, ఎమ్మార్పీస్ జిల్లా సురుగు శ్రీనివాస్ మాదిగ, యంయస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ చేట్ పల్లి లక్ష్మణ్,యంయస్పి జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, జిల్లా ప్రచారం కార్యదర్శి కొల్లూరి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img