వనమాపై వేటు
- అనర్హత వేటు వేసిన హైకోర్టు
- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
- కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు
- తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వనమా..
ఇదేనిజం, స్టేట్ బ్యూరో: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంతో చర్యలు తీసుకున్నది. రూ. 5 లక్షలు జరిమానా కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన వనమా వెంకటేశ్వరావు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. కాగా ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని.. ఆయన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తేల్చింది. డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ వెల్లడించింది.
అఫిడవిట్ లో అవాస్తవాలు..
ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు సమర్పించిన వివరాలు అవాస్తవాలని హైకోర్టు నిర్ధారించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. వనమా వెంకటేశ్వరావు తప్పుడు వివరాలు సమర్పించారంటూ అతడి సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు.