ఇదే నిజం, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో మల్లన్న జాతర ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు ఉత్సవ నిర్వాహకులు గోవర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. జాతర ఉత్సవాలను విజయవంతం చేసిన గ్రామస్తులకు ఉత్సవ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.