- నేను చెప్పినోళ్లకే టికెట్లు
- అధిష్ఠానం పెద్దలు టచ్ లో ఉంటారు..
- మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
mallareddy comments: ఇదే నిజం, స్టేట్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లను డిసైడ్ చేసేది తానేనంటూ వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. తాను చెప్పినోళ్లకే కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్లు ఇస్తుందన్నారు. గత ఎన్నికల్లో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి తాను చెబితేనే టికెట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతలు తనతో టచ్ లో ఉంటారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఇటీవల తరుచూ కాంట్రవర్సి కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఓట్ల కోసమే ఆర్టీసీని విలీనం చేస్తున్నామంటూ నిన్న మాట్లాడిన మల్లారెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.