కాంగ్రెస్ ప్రబుత్వం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మళ్లీ మన టైం వస్తుంది అన్నీ రాసుకుంటున్నా.. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం అని అన్నారు. గ్రామాల్లో కార్యకర్తలను వేధిస్తున్న వాళ్ల పేర్లు రాసుకోండి.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం అని పార్టీ కార్యకర్తలతో అన్నారు. రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడితే మనం రైతుల గురించి మాట్లాడుదాం, ప్రజల గురించి ఆయన ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడుదాం అని పేర్కొన్నారు. ముసలి వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఎప్పడు ఇస్తావు, ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఎప్పటినుండి ఇస్తావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇప్పటి నుండి ఇస్తావు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎప్పడు ఇస్తావు అంటూ నెలకు ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేద్దాం అని కేటీఆర్ పిలుపు ఇచ్చారు. మోహం బాగలేక అద్దాన్ని పగల కొట్టినట్టు.. ప్రభుత్వాన్ని నడపడానికి చాతకాక రేవంత్ రెడ్డి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నారు. ముఖ్యమంత్రి అనే వాడు రాష్ట్రం మంచిగా ఉంది ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి.. అంతే కాని రాష్ట్రం దివాళా తీసింది, అప్పులపాలు అయిపోయిందని ఎవడైనా చెప్తాడా అంటూ కేటీఆర్ మండిపడ్డారు.