తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం నిర్మాణంలో మరో కీలక బీజం పడింది. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి లేఖ రాసింది.