ఇదే నిజం, కోరుట్ల టౌన్ : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం హాజీపూర్ లో కత్తిపోట్లు కలకలం రేపాయి. వివరాలలోకి వెళితే.. హజీపూర్ లో పాషా, సయ్యద్ మొహియుద్దీన్ (65) లు ఒకే ఇంటిలో వేరువేరు పోర్షన్ లలో కిరాయికి ఉంటున్నారు. కాగా చిన్నపిల్లల బాత్రూం విషయం లో జరిగిన గొడవ తో కోపోద్రిక్తుడైన పాషా కత్తి తో మొహియుద్దీన్ పై దాడి చేయడం తో తీవ్ర రక్త స్రావం జరిగింది. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.