ఇదేనిజం, ధర్మపురి (ఎండపల్లి) : జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలం పడకల్ గ్రామంలో వాడుకపురం శ్రీనివాస్(44) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెలుగటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపిన విరాల ప్రకారం..గతంలో ఫైనాన్స్ ద్వారా అప్పుచేసి ట్రాక్టర్ కొన్నాడు. ట్రాక్టర్ అప్పులు తీర్చలేక శనివారం రోజున ఇంట్లో నుండి వెళ్లిన శ్రీనివాస్ గ్రామ శివారులోని చెట్టుకు కరెంట్ వైర్ తో ఉరి వేసుకుని చనిపోయాడు. సోమవారం రోజున అటువైపు వెళ్లిన స్థానికులు ఇంట్లో సమాచారం ఇవ్వడంతో చనిపోయాడని నిర్ధారించారు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.