ఇదే నిజం, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో దారుణం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మల్యాల నరేష్ అనే వ్యక్తిని బండ రాయితో కొట్టి చైతన్య అనే వ్యక్తి హత్య చేశాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.