వర్జీనియాలో ఓ తల్లీ కొడుకులు కలిసి షాపింగ్‌కు వెళ్ళారు. ఆడవారు షాపింగ్ అంటే అలా వెళ్ళి ఇలా రారు కదా తక్కువలో తక్కువ సగం రోజు అయినా అక్కడే గడిచిపోతుంది. ఇక ఇండియాలో అయితే పక్కనే ఏమైనా హోటళ్లు ఉంటే మగవారు అక్కడ రూం బుక్ చేసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు కూడా. ఇక ఇలాగే తన తల్లిని షాపింగ్ స్పాట్లో దింపేసిన కొడుకు బోర్ కొట్టడంతో సరదాగా ఓ స్క్రాచ్ కార్డ్ లాటరీ కొనుగోలు చేసాడు. ఇక ఏముంటది లే అనుకుని ఇతర ప్రాంతాలు తిరిగి ఆ స్క్రాచ్ కార్డును జేబులో పెట్టుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ కార్డు గుర్తొచ్చి ఇంట్లో దాన్ని స్క్రాచ్ చేయగా దానిలో ఉన్న అంకెలు చూసి గట్టిగా అరిచాడు. దీంతో ఉన్నట్టుండి వీనికేంపుట్టింది అనుకుంటూ అతని తల్లి కూడా ఆ అంకెలు చూసి అరవడం మొదలు పెట్టింది. అయితే ఆ స్క్రాచ్ కార్డులో ఏకంగా 20 లక్షల డాలర్స్ గెలుచుకున్నట్టు ఉంది. అంతే ఇక వారి లెవల్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
తల్లి షాపింగ్ చేసేలోపు కొడుకు కోట్లు సంపాదించాడు…
RELATED ARTICLES