Homeహైదరాబాద్latest Newsమనబడి.. మళ్లీ తడబడి

మనబడి.. మళ్లీ తడబడి

– తుదిదశలో నిలిచిపోయిన పనులు
– మరమ్మతులకు మోక్షమెప్పుడు?
– కొత్త సర్కారు పనులను కొనసాగిస్తుందా?

ఇదే నిజం, నర్సంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ‘మన ఊరు – మనబడి’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి. దీంతో ఈ పనులు పూర్తవుతాయా? లేదా? అన్నది సస్పెన్స్​గా మారింది. నర్సంపేట నియోజకవర్గంలో చాలా చోట్ల ‘మన ఊరు – మన బడి’ పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల నత్తనడకన పనులు సాగుతున్నాయి. పోయిన ఏడాది జూలై నుంచి చేస్తున్న పనులకు ఇంకా నిధులు రావాల్సి ఉంది. కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఫలితంగా తొలి విడతలో ప్రారంభించిన అదనపు తరగతి గదులు మరమ్మత్తులు డైనింగ్ హాలు, వంటశాలలో మూత్రశాలలు పనులకు మోక్షం కలిగేలా లేదు. ఈ సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా రెండు మూడు దశల్లో పనులు ప్రారంభించేనా? లేక పక్కన పెడుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

12 రకాల అభివృద్ధి పనులు
ఈ పథకం కింద 12 రకాల అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తొలినాళ్లలో చాలామంది కాంట్రాక్టర్ల బిల్లుల మంజూరు పై సందేహంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. ఇన్నాళ్లూ 70 నుంచి 80 శాతం సివిల్ పనులు పూర్తి చేయించారు. వీటితోపాటు మిగతా చిన్నపాటి మరమ్మత్తులు చేపడితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యాలయాల పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. నిబంధన ప్రకారం పాఠశాలల యజమాని కమిటీలు( ఎస్ఎంసి) చైర్మెన్ల ఆధ్వర్యంలో పనులు చేపట్టాల్సి ఉంది. కానీ చాలా చోట్ల సర్పంచులు వీటిని ప్రారంభించారు. నర్సంపేట డివిజన్లో సుమారు నాలుగు కోట్లకు పైగా నిధులు చేపట్టే పనులకు టెండర్లు నిర్వహించగా కొన్ని మండలాల్లో కాంట్రాక్టర్లు (సర్పంచులు) పనులు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img