Homeహైదరాబాద్latest Newsఫీజుల రియంబర్స్మెంట్ గురించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యం

ఫీజుల రియంబర్స్మెంట్ గురించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యం

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల తరపున మీ దృష్టికి తీసుకు వచ్చే విషయం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా 2021-22, 2022-23,2023-24 మాకు ఇవ్వ వలసిన ఫీజు రియంబర్స్ మెంట్ మొత్తాలను విడుదల చేయక పోవడం వల్ల మాకు కళాశాల నిర్వహణ భారంగా మారినది. గత సంవత్సరం ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసి ట్రెజరీ ద్వారా టోకెన్లు ఇచ్చినా ఇంతవరకు ఆ టోకెన్ల డబ్బులు విడుదల కాకపోవడం వల్ల కళాశాల ల నిర్వహణ కోసం తీసుకున్న అప్పులు, వడ్డీలు, అధ్యాపకుల జీతాలు, కళాశాల భవనాల అద్దెలు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించడం లో యాజమాన్యాలు తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం.

కావున మీరు మా ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని మా నియోజక వర్గం ప్రతినిధి గా ప్రభుత్వం ద్రుష్టి కి మా సమస్యను తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించగలరని మనవి. మా డిగ్రీ కళాశాలలు కేవలం పూర్తిగా ఫీజు రియంబర్స్ మెంట్ పై ఆధారపడి విద్యార్థులకు నాణ్యమైన విద్యను తక్కువ ఫీజుతో ఎక్కువ మంది అనగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మందికి అందిస్తూ, మాతోబాటు గా సుమారు 1,25,000 మంది నిరుద్యోగ పట్టభద్రులకి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాము. ఇప్పుడు ఫీజు రియంబర్స్ మెంట్ రాకపోవడంతో అందరం ఇబ్బందులు పడుతున్నాము. ప్రొఫెషనల్ కళాశాలలకు విద్యార్ధులనుండి ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. మాకు ఏమాత్రం ఉండదు.

మాకు గత ప్రభుత్వం లో ఎన్నికలకు 4 నెలల ముందు నుండి మరియు కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత 7 నెలలు అనగా 11 నెలల కాలం నుండి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం వల్ల నిర్వహణ పెనుభారంగా మారినది. ప్రస్తుతం డిగ్రీ 3 వ సంవత్సరంపూర్తి చేసుకున్న విద్యార్థులకు చెందిన 2 సంవత్సరాల ఫీజు మొత్తం ( 2022-23 & 2023 -24 ) ఇంకనూ రాలేదు, కొన్ని కళాశాలకు 2021-22 వి కూడా రావాలి. కావున ఈ విషయాలు అన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేసేలా మీరు చొరవ తీసుకోవాలని మా మనవి.

Recent

- Advertisment -spot_img