Mancherial:చికెన్ వండలేదని భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో వెలుగు చూసింది.నిన్న రాత్రి భర్త గాలిపెల్లి పోశం(50) చికెన్ తీసుకురాగా, భార్య వండలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న భార్య శంకరమ్మపై పోశం గురువారం ఉదయం గొడ్డలితో దాడి చేశాడు. విచక్షణారహితంగా నరికి చంపాడు. అనంతరం పోశం పరారీ అయ్యాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేసుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.