ఇదే నిజం, మంచిర్యాల: సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.5లక్షలు కాజేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సీలాల్ తెలిపారు. మంచిర్యాలకు చెందిన నగేశ్, కుమార్ వద్ద సోమగూడెంకు చెందిన సింగరేణి ఉద్యోగి విష్ణు ప్రసాద్ మరో వ్యక్తి హరికిషన్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తానని 2022లో రూ.5లక్షలు తీసుకొని మోసం చేసినట్లు సిఐ పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరి పై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా ఉద్యోగం ఇస్తామని మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.