ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం వేదపండితులు అర్చకులు సాదరంగా స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నంభి నరసింహ మూర్తి పాల్గొన్నారు.