Homeహైదరాబాద్latest NewsManchu Family : మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు హాజరైన...

Manchu Family : మంచు ఫ్యామిలీ ఆస్తి వివాదం.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు హాజరైన తండ్రి కొడుకులు

Manchu Family : మంచు ఫ్యామిలీ లో (Manchu Family) గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్, మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ ఆస్తి వివాదంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆస్తి వివాదంపై కలెక్టర్ విచారణకు మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మంచు మనోజ్ తన ఇల్లు, ఆస్తులను ఆక్రమించాడని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలోని తన ఇంట్లో అక్రమంగా ప్రవేశించి ఆస్తులు కావాలని లేఖలో పేర్కొన్నాడు. తన సొంత ఆస్తులపై ఎవరికీ హక్కు లేదని, తన ఆస్తులను తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు.

Recent

- Advertisment -spot_img