మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించింది మంచు లక్ష్మి. త్వరలో అగ్ని నక్షత్రం అనే సినిమాతో రాబోతుంది. మంచు లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ చేస్తుంది. తాజాగా తన మకాం ముంబైకి మార్చేసింది. కొన్ని నెలల క్రితమే ముంబైకి వెళ్ళిపోయింది.
ముంబైలో తాను తీసుకున్న కొత్త ఇల్లుని ఈ వీడియోలో చూపించింది. ముంబై హౌస్ హోమ్ టూర్ అంటూ ఆ ఇంటి గురించి చెప్పింది. ముంబైలో దాదాపు 28 ఇల్లులు చూసాక ఈ ఇల్లు నచ్చిందని తెలిపింది. మంచు లక్ష్మి ముంబై కొత్తింట్లో పెద్ద హాల్, మూడు బెడ్ రూమ్స్, చిన్న పిల్లలకు ఇంకో బెడ్ రూమ్, కిచెన్, బాల్కనీ, మేకప్ రూమ్, బాత్రూమ్స్.. ఇలా అన్ని లగ్జరీగా ఉన్నాయి.
ఎప్పుడు యాక్టివ్ గా మంచు లక్ష్మీ ముంబైలో బాలీవుడ్ హీరోయిన్స్ తో కలిసి జిమ్ లకు, పార్టీలకు వెళ్లడం మొదలుపెట్టింది. త్వరలో బాలీవుడ్ ఛాన్సులు పట్టేసి అక్కడ వెబ్ సిరీస్ లలో బిజీ అవ్వాలని చూస్తుంది. ఇలా నటనపై ఫోకస్ చేస్తూనే మరో వైపు తన సేవా సంస్థ టీచ్ ఫర్ చేంజ్ తో పలు సేవా కార్యక్రమాన్ని కూడా చూసుకుంటుంది.