Manchu manoj:మంచు వారింట పెళ్లి సందడి షూరు అయ్యింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి (మార్చి 3న) భూమ మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడగులు వేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మనోజ్. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
మనోజ్ వివాహం తన సోదరి మంచు లక్ష్మి ఇంట శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు ఇరు కుటుంబసభ్యులు.. అతి కొద్ది మంది సన్నిహితులు, రాజకీయ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి వేడుక జరగనుంది. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.