మంచు ఫామిలీ వివాదంపై వారి ఇంట్లో పనిచేసి పని మనిషి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. అసలు మంచు ఫ్యామిలీ వివాదంపై పనిమనిషి ఏమన్నదంటే.. స్టాఫ్ వల్లే గొడవ జరిగింది. మోహన్ బాబుపై మంచు మనోజ్ చేయి చేసుకున్నాడు. తండ్రీ కొడుకులు నెట్టుకున్నారు. మనోజ్‌కు దెబ్బలు తగల్లేదు. మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టం లేదు. మోహన్ బాబు మీద చేయిపడితే విష్ణు ఊరుకోడు. అసలు జరిగింది ఏమిటంటే.. శనివారం రాత్రి ప్రసాద్ అనే తన సిబ్బంది ఒకరు తప్పు చేయగా మోహన్ బాబు దండించారు. ఈ విషయం తెలిసి ఉదయం మరోసారి ప్రసాద్‌ను మనోజ్ దండించబోయారు. అదే సమయంలో నా సిబ్బందిపై చెయ్యి వేయవద్దు, వారికి నేనే భయం చెప్పుకుంటాను.. అంటూ మనోజ్‌ని మోహన్ బాబు తోసేశారు. అనంతరం ఒకరినొకరు తోసుకున్నారు. అసలు జరిగింది ఇదే. దీనికి వారి మధ్య ఉన్న పాత గొడవలను కూడా యాడ్ చేసుకుని.. విషయాన్ని పెద్దది చేసుకుంటున్నారు. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మొదటి నుండి మోహన్ బాబుకి ఇష్టం లేదు.. అని పనిమనిషి చెప్పుకొచ్చింది.