Homeహైదరాబాద్latest NewsManchu Manoj : అన్నయ్య నన్ను క్షమించు.. "కన్నప్ప" మూవీ హిట్టు అవ్వాలి.. మనోజ్ ఎమోషనల్...

Manchu Manoj : అన్నయ్య నన్ను క్షమించు.. “కన్నప్ప” మూవీ హిట్టు అవ్వాలి.. మనోజ్ ఎమోషనల్ కామెంట్స్

Manchu Manoj : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘భైరవం’ మే 30న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్ తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే గతంలో ‘కన్నప్ప’ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పారు.

మనోజ్ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. మొదట్లో ఆ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. విష్ణు నన్ను వ్యక్తిగతంగా బాధపెట్టాలనుకున్నాడు. కానీ నా భార్య వాళ్ల అమ్మ, నాన్న జ్ఞాపలను దాచుకుంటే వాటిని కూడా ధ్వంసం చేశాడు. అది చాలా బాధగా అనిపించింది. ఇటీవల ఓ ఈవెంట్‌లో ‘శివయ్యా’ అంటూ ‘కన్నప్ప’ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు అనవసరమని, చెప్పకుండా ఉండాల్సిందని అని అన్నారు.

‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు నటించారు. ఎంతో మంది ఆ సినిమా కోసం కష్టపడ్డారు. నా వ్యాఖ్యల వల్ల వారి అభిమానులు బాధపడి ఉంటారేమోనని అనిపించింది. ఒక వ్యక్తి వల్ల అంత మంది కష్టాన్ని తక్కువ చేయడం సరికాదు. అందుకే ఆ సినిమా టీమ్‌కు, అభిమానులకు నా మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.. కన్నప్ప సినిమా కూడా గొప్ప విజయం అవ్వాలి అని కోరుకుంటున్నాను అని మనోజ్ కామెంట్స్ చేసాడు.

Recent

- Advertisment -spot_img