హీరో మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నేడు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆళ్లగడ్డకు వచ్చిన మంచు మనోజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. జనసేన పార్టీలో చేరడంపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని మంచు మనోజ్ అన్నారు. మొదటి సారి కూతురు దేవసేన శోభను ఆళ్ల గడ్డకు తీసుకువచ్చాం అని అన్నారు. నా కోసం రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులకు మంచు మనోజ్ థ్యాంక్స్ చెప్పారు.