Manchu Manoj : మంచు ఫ్యామిలీ లో గొడవలు తార స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో మంచు బ్రదర్స్ మధ్య సోషల్ మీడియాలో ట్వీట్ వార్ నడుస్తుంది. తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) ఒక ట్వీట్ చేసాడు. ”కూర్చొని మాట్లాడుకుందాం. తండ్రిని, ఇంట్లోని ఆడవాళ్ళను, ఉద్యోగస్తులను, అందరినీ పక్కన పెట్టి మాట్లాడుకుందాం. నువ్వు ఏమని అంటావు .. నేను ఒక్కడినే వస్తానని అని నీకు మాట ఇస్తున్నాను. నీకు కావాలంటే నువ్వు ఎవరినైనా తీసుకురావచ్చు లేదా మనం ఇద్దరం ఆరోగ్యకరమైన చర్చను జరుపుకుందాం.. ఇట్లు నీ కరెంట్ తీగ” అని మంచు మనోజ్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.