Homeఫ్లాష్ ఫ్లాష్Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

manchu 2 ఇదేనిజం Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు బ్రేకులు వేస్తూ మంచు మనోజ్ ప్రేమించిన భూమా మౌనిక రెడ్డి తో ఏడడుగులు వేశారు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఫిలింనగర్లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహ వేడుక చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ వివాహం మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని అందుకే వివాహానికి ఆయన హాజరయ్యే అవకాశాలు లేవని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు మంచు మోహన్ బాబు  తన రెండవ కుమారుడు రెండవ వివాహానికి హాజరై నూతన దంపతులకు తన దీవెనలు అందించారు.

ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు దీవిస్తున్న సమయంలో భూమా మౌనిక రెడ్డి ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. రారు అనుకున్న పెళ్లికి ఆయనే పెద్దదిక్కుగా రావడం చూసి ఆమె ఎమోషనల్ అయిపోయారు ఒక్కసారిగా మోహన్ బాబుని పట్టుకొని ఏడ్చేశారు.

manchu manoj second marrige ఇదేనిజం Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్ ఉంటే చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని కొన్నాళ్ళకి విడాకులు ఇచ్చారు.

manchu manoj first wife pranathi reddy ఇదేనిజం Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

మరోపక్క భూమా మౌనిక రెడ్డి కూడా భూమా నాగిరెడ్డి కూతురుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తండ్రి ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మాన్ తో ఆమె వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వారిద్దరికీ కూడా విడాకులు అయ్యాయి.

manchu manoj guest for mounika marrige ఇదేనిజం Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి మధ్య సానిహిత్యం పెరిగి అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి తమ రెండవ వివాహం ఘనంగా చేసుకున్నారు.ఇక వివాహం మొత్తాన్ని మంచు లక్ష్మి తన చేతులమీదుగా జరిపించింది. మంచు మనోజ్. వివాహంలో ప్రతిఘట్టంలోనూ ఆమె కనిపించారు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

manchu ఇదేనిజం Manchu manoj marrige:మనోజ్ పెళ్లిలో మోహన్ బాబు.. కన్నీటి పర్యంతమైన మౌనిక.

Recent

- Advertisment -spot_img