Homeహైదరాబాద్latest Newsమంచు మనోజ్‌కి వైద్య పరీక్షలు పూర్తి..! డాక్టర్లు ఏమన్నారంటే..?

మంచు మనోజ్‌కి వైద్య పరీక్షలు పూర్తి..! డాక్టర్లు ఏమన్నారంటే..?

మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మనోజ్ మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగి, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. తాజాగా మంచు మనోజ్‌కి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాలికి గాయం కావడంతో భార్య మౌనికతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్ , ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. మెడలోని కండరాలపై స్వల్ప గాయం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంచు మనోజ్ కుడి కాలు కండరాల నొప్పితో ఆసుపత్రికి వచ్చారు. సిటీ స్కాన్ మరియు ఎక్స్-రే నివేదికలు నార్మల్ గా ఉందని తెలిపారు. మంచు మనోజ్‌కి రెండు గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంచు మనోజ్ త్వరలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లనున్నారు.

Recent

- Advertisment -spot_img