Manchu Vishnu : హీరో మంచు విష్ణు తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని మాతృస్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నాడు. ఈ సందర్భంగా విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ విద్య, వైద్యంతో పాటు అన్ని విషయాల్లోనూ వారికి అన్నయ్యలా అండగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ అనవసర ఖర్చులు తగ్గించుకుని అనాథలకు సహాయం చేయాలని మంచు విష్ణు కోరారు. అలాగే వారితో పండుగ జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందని హీరో మంచు విష్ణు అన్నారు.