Homeహైదరాబాద్latest Newsమంచు విష్ణు 'కనప్ప' మూవీ రిలీజ్ వాయిదా

మంచు విష్ణు ‘కనప్ప’ మూవీ రిలీజ్ వాయిదా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కనప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రాల్లో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాని ముందుగా డిసెంబర్‌ 14న విడుదల చేయాలని భావించారు, కానీ ఇప్పుడు ఈ సినిమాని ఏప్రిల్ 2025లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో మంచు విష్ణు మాట్లాడతూ.. ‘కన్నప్ప’ సినిమాని డిసెంబర్‌లో తీసుకురావాలని అనుకున్నాం. కానీ వీఎఫ్‌ఎక్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా పూర్తి కాలేదని విష్ణు మంచు తెలిపారు. మంచి చిత్రాన్ని ప్రజలకు అందించాలని మేకర్స్ కోరుకుంటున్నారని నటుడు చెప్పారు. దీని కారణంగా ఏప్రిల్ 2025 విడుదల తేదీని ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.ఇప్పుడు ఈ సినిమాని 25 ఏప్రిల్ 2025న విడుదల కానుంది ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img