Homeహైదరాబాద్latest Newsమంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. మనోజ్ ఇంట్లో కరెంట్ కట్..!!

మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ.. మనోజ్ ఇంట్లో కరెంట్ కట్..!!

మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతోంది. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్, మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఇంట్లో కరెంట్ కట్ చేసారు. శనివారం రాత్రి జల్‌పల్లిలోని మనోజ్ నివాసంలో స్నేహితులతో కలిసి పార్టీ ఏర్పాటు చేసుకోగా ఓ జనరేటర్ తెప్పించారు. అయితే అందులో మంచు విష్ణు తన అనుచరులతో కలిసి పంచదార పోయించాడు. దీంతో మంచు మనోజ్‌ ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ బయలుదేరాడు.

Recent

- Advertisment -spot_img