సీఎం రేవంత్‌పై మందకృష్ణ మాదిగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సీఎం రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ చేస్తామన్నారు. వర్గీకరణ అమలు చేయకుండానే టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్-1 పోస్టులకు వర్గీకరణ వర్తింపజేయాలి. ఆ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించాలి. వర్గీకరణ తర్వాతే గ్రూప్-2, 3 పరీక్షలు నిర్వహించాలి. అప్పటివరకు పరీక్షలను ఆపండి” అని మందకృష్ణ తెలిపారు.