Homeహైదరాబాద్latest Newsబాధితుడికి అండగా మండల ఉపాధ్యాయులు

బాధితుడికి అండగా మండల ఉపాధ్యాయులు

ఇది నిజం, వేమనపల్లి : ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి కోమానుంచి కోలుకున్న హోంగార్డు ధర్మయ్యకు ఉపాధ్యాయులు బాసటగా నిలిచారు. వేమనపల్లి మండలంలోని ఉపాధ్యాయులందరూ కలిసి రూ. 25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఫిబ్రవరి 11వ తేదీన భార్యా భర్తలు ఇద్దరూ బైక్ పై లక్షిట్టిపేటకు వెళ్తుండగా జైపూర్ అటవీ ప్రాంతంలో రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో నీల్వా యి ధర్మయ్య అతని భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. ధర్మయ్య 14 రోజులు కోమాలో ఉండి ఇటీవలే కోలుకున్నాడు. కానీ మంచానికే పరిమితయ్యాడు. దీంతో పూట గడవడం కష్టంగా మారింది . ఇప్పటికే వైద్య ఖర్చులు లక్షల్లో అయ్యాయి. బాధితులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img