HomeరాజకీయాలుManifesto of welfare schemes సంక్షేమ పథకాల Manifesto

Manifesto of welfare schemes సంక్షేమ పథకాల Manifesto

– హామీల వరాలు గుప్పించిన బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్
– ప్రతి ఇంటికి రూ.5 లక్షలతో కేసీఆర్ భీమా
– ఆసరా పెన్షన్లు రూ.5 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంపు
– రైతుబంధు ఏడాదికి రూ.16 వేలు
– తెల్లరేషన్ ఉన్నవారికి సన్నబియ్యం
– ఆరోగ్య శ్రీ పరిమితి రూ.15 లక్షలకు పెంపు
– ప్రజాకర్షక హమీలను ప్రకటించిన గులాబీ బాస్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో హ్యాట్రిక్​ విజయాన్ని సొంతం చేసుకుని, అధికారం చేపట్టలన్న లక్ష్యంతో బీఆర్ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రకటించారు. ఆదివారం సీఎం కేసీఆర్​ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టామన్నారు. గతంలో ఇచ్చిన అన్ని హామీలను 99.95 శాతం అమలు చేశామన్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రస్తుత పథకాలతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామన్నారు. అనంతరం తెలంగాణలోని రైతులు, వృద్దులు, దివ్యాంగులు, మహిళలు, గిరిజనులు, జర్నలిస్టులపై గులాబీ బాస్​ హామీల వరాలు కురిపించారు. ‘తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన‌ రైతుబంధు, రైతుబీమాకు మంచి స్పంద‌న వ‌స్తుంది. ల‌క్ష‌కు పైగా కుటుంబాల‌కు దిన‌వారం వెళ్ల‌కముందే రూ. 5 ల‌క్ష‌ల చొప్పున వారికి అందాయి. చేనేత కార్మికుల‌కు, గీత కార్మికుల‌కు కూడా బీమా తెచ్చాం. ఈ క్ర‌మంలోనే ఒక కొత్త స్కీం తెవాల‌ని నిర్ణ‌యించాం.

రాష్ట్రంలో ఒక కోటి 10 ల‌క్ష‌ల కుటుంబాలు ఉంటాయ‌ని అంచ‌నా. ఈ కుటుంబాల్లో 93 ల‌క్ష‌ల‌కు పై చిలుకు బీపీఎల్ కార్డులు ఇచ్చాం. వారంద‌రూ కూడా బీపీఎల్ కింద ప‌రిగ‌ణించ‌బ‌డుతారు. అర్హులైన తెల్ల‌కార్డు క‌లిగిన పేద కుటుంబాల‌కు గెలిచిన తెల్లారి నుంచే 100కు 100 శాతం ప్ర‌భుత్వ‌మే ప్రీమియం చెల్లించి కేసీఆర్ బీమా ప్ర‌తి ఇంటికి దీమా అనే ప‌ద్ధ‌తుల్లో బీమా స‌దుపాయాల‌న్ని క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.’ అని కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన బ‌డ్జెట్ లెక్క‌లు తీయించామన్నారు. ‘బీపీఎల్ కార్డు హోల్డ‌ర్స్ అంద‌రికీ.. ఎల్ఐసీ ద్వారానే చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. కేసీఆర్ బీమా ప్ర‌తి ఇంటికి దీమా.. దీని ద్వారా బీమా సౌక‌ర్యం వ‌స్తుంది. ప్ర‌తి కుటుంబానికి రూ. 3600 నుంచి 4 వేల రూపాయాలు ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంది. అయినా ప్ర‌భుత్వం వెనుకాడ‌టం లేదు. ఐదు ల‌క్ష‌లు వ‌చ్చే విధంగా రైతుబీమా త‌ర‌హాలోనే ఉంటుంది. నాలుగైదు మాసాల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసి, జూన్ నుంచి అమ‌లు చేస్తాం. ఇది పాపుల‌ర్ స్కీం.. అన్ని కుటుంబాల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంలా ఉంటుంది’ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.


ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తం


త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డే ముందు ఆరోగ్య శ్రీ ప‌థ‌కం కింద ఇన్సూరెన్స్ రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండేదని కేసీఆర్ తెలిపారు. తాము రూ. 5 ల‌క్ష‌ల‌కు తీసుకెళ్లామని, అనంత‌రం దాన్ని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచామన్నారు. ‘మేం అనుకున్న‌న్ని మెడిక‌ల్ కాలేజీలు పెట్టాం.. అవి విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నాయి. 10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసే స్థాయికి తెలంగాణ‌ ఎదుగుతుంది. వ‌రంగ‌ల్‌లో అద్భుత‌మైన హాస్పిట‌ల్ నిర్మాణం జ‌రుగుతోంది. నాలుగైదు నెలల్లో అందుబాటులోకి రాబోతుంది. ఆరోగ్య వ్య‌వ‌స్థ ప‌టిష్టం అవుతోంది. మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ రాబోతున్నాయి. ఇక ఆరోగ్య‌ శ్రీ గ‌రిష్ఠ ఇన్సూరెన్స్‌ను రూ. 15 ల‌క్ష‌ల‌కు పెంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. జ‌ర్న‌లిస్టుల‌కు కూడా ఉద్యోగ‌స్తుల‌కు పెట్టిన స్కీం పెట్టాల‌ని నిర్ణ‌యించాం. ఈహెచ్ఎస్ ట్ర‌స్ట్ పెట్టాం. దానికి సీఎస్ అధ్య‌క్ష‌త వ‌హిస్తున్నారు. ప్రెస్ అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో జ‌ర్న‌లిస్టుల‌కు కూడా రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచితంగా వైద్యం అందిస్తాం. ప్ర‌జ‌ల‌కు కూడా ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. దీనికి కేసీఆర్ ఆరోగ్య ర‌క్ష అని పేరు పెట్టారు’కేసీఆర్ వివ‌రించారు.

సీఎం ప్రకటించిన హామీలివే…

రైతుబంధు రూ.16 వేలు :
రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయ రంగంపైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారని, తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగిందన్నాని కేసీఆర్ తెలిపారు. రైతుబంధు ప‌థ‌కాన్ని రూ. 16 వేల‌కు పెంచుతున్నామని, ఇది కూడా మొద‌టి ఏడాది రూ.12 వేలు పెరుగుతుందని, ప్ర‌తి ఏడాది కొంత పెరుగ‌తూ ఐదో ఏడాదికి రూ.16 వేల‌కు చేరుకుంటుందన్నారు.

కేసీఆర్ బీమా :
ప్రతి ఇంటికి ధీమా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత బీమా అందిస్తామని, దీని ద్వారా 93 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేసీఆర్ తెలిపారు.

ఆసరా పింఛన్​ రూ.5వేలు :
ప్రస్తుతం తెలంగాణలోని వృద్ధులకు ప్రభుత్వం రూ.2016 ఆసరా పింఛన్ అందజేస్తుంది. అయితే ఆ మొత్తాన్నిబీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూ.5వేలకు పెంచారు. తొలి ఏడాది రూ.1000, ఆ తర్వాత ఏటా రూ.500ల చొప్పున రూ.5వేలకు పెంచుతామని కేసీఆర్​ ప్రకటించారు. దివ్యాంగులకు రూ.4016 ఉన్న పింఛన్​ రూ.6వేలకు పెంచారు. దివ్యాంగుల పింఛన్​ తొలి ఏడాది రూ.5వేలు ఇస్తామన్నారు. ఏటా రూ.300ల చొప్పున పెంచుతామన్నారు.

మహిళలకు రూ.3వేల భృతి :
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతినెల రూ.3వేలు చొప్పున భృతి చెల్తిస్తానమని కేసీఆర్ ప్ర‌క‌టించారు. బీపీఎల్ కార్డు క‌లిగిన వారికి దీన్ని వ‌ర్తింపజేస్తామన్నారు.

రేషన్ కార్డులున్న అందరికీ సన్నబియ్యం :
తెలంగాణ అన్న‌పూర్ణ ప‌థ‌కం కింద ప్ర‌తి రేష‌న్ కార్డు దారునికి స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ఆక‌లి కేక‌లు లేవు అని స్ప‌ష్టం చేశారు కేసీఆర్. హాస్ట‌ల్స్ పిల్ల‌ల‌తో పాటు అంగ‌న్వాడీలో చ‌దువుకునే పిల్ల‌ల‌కు కూడా స‌న్న‌బియ్యం అందిస్తున్నామన్నారు. ‘అన్న‌పూర్ణ‌గా త‌యారైన రాష్ట్రంలో ప్ర‌తి కుటుంబానికి కూడా స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. ప్ర‌తి రేష‌న్ కార్డు హోల్డ‌ర్‌కు వ‌చ్చే ఏప్రిల్, మే నుంచి స‌న్న‌బియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండ‌దు. ఈ స్కీంకు తెలంగాణ అన్న‌పూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్ర‌భుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం’ అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ :
అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.

గిరిజనులకు మరిన్ని పథకాలు :
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు. గిరిజనుల కోసం ప్రకటించని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు. లంబాడీ తండాలు, గోండు గూడేలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ రూ. 15 లక్షలకు పెంపు :
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు.

పేదలకు ఇండ్ల స్థలాలు :
రాష్ట్రంలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని, ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ కొనసాగిస్తామన్నారు.

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు :
తెలంగాణలోని అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు.

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు :
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేత :
పట్టాదారుడు అయితే భూమిని అమ్ముకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న దగ్గర కూడా కోట్ల రూపాయల డిమాండ్‌ ఉందని, అలాంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటురన్నారు. కానీ వారికి అలాంటి సదుపాయం లేదని, దాన్ని రిలీవ్‌ చేయాలని దళిత సోదరులు కోరుతున్నారని, అసైన్డ్​ భూములపై ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు.

ఉద్యోగుల సీపీఎస్​పై అధ్యయన కమిటీ :
సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారని, దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Recent

- Advertisment -spot_img