తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 హోరాహోరీగా సాగుతోంది. ఏడో వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కాస్త ప్రత్యేకంగా జరిగింది. ఎందుకంటే మణికంఠ తనంతట తానే బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. మణికంఠ హౌస్ లో ఉన్నపుడు తన భార్యకి, బిడ్డకి దూరంగా ఉన్నాని.. ఈ షో ద్వారా అయినా తన భార్య, బిడ్డ తన వద్దకు రమ్మని ఉద్వేగానికి లోనయ్యేవాడు. అయితే ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనభార్య తనను కలిసిన లేదా అనే విషయంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై మాట్లాడ్తూ.. తన దగ్గరికి తన భార్య వచ్చిందని, ఆ లేఖ నాకు వచ్చినప్పుడే మేమిద్దరం కలిసిపోయామని మణికంఠ తెలిపాడు.