- విపక్షాలకు అభ్యంతరమేంటి?
- ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్..
manipur: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: మణిపూర్ ఘర్షణలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా విపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏమిటని అమిత్ షా (amith shah) ఫైర్ అయ్యారు. మణిపుర్(manipur)లో చోటుచేసుకుంటున్న ఘర్షణలు, వాటిలో భాగంగా వెలుగులోకి వచ్చిన వీడియో రాజకీయంగా దుమారం రేపుతోంది. దాంతో వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడారు. మణిపుర్ అంశంపై చర్చ జరిగేలా చూడాలని విపక్ష పార్టీలను కోరారు.
‘ఈ సభలో మణిపుర్ అంశంపై చర్చకు నేను సిద్ధమే. దీనిపై చర్చ జరిగేలా చూడాలని నేను విపక్ష పార్టీలను కోరుతున్నాను. ఈ సున్నితమైన అంశంపై దేశం నిజం తెలుసుకోవడం ముఖ్యం’అని అమిత్ షా సభ్యులను అభ్యర్థించారు. అలాగే ఈ అంశంపై చర్చకు విపక్షాలు ఎందుకు సుముఖంగా లేవో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన కోరిన తర్వాత కూడా కూడా ఎంపీలు తమ నిరసన కొనసాగించారు. దాంతో దిగువ సభ కార్యకలాపాలు రేపటి వరకు వాయిదా పడ్డాయి.