Homeజాతీయంmanipur:మణిపూర్​ను దేశం నుంచిఎవరూ విడదీయలేరు

manipur:మణిపూర్​ను దేశం నుంచిఎవరూ విడదీయలేరు


– రాహుల్​ మహిళా ఎంపీలకు ఫ్లైయింగ్​ కిస్​ ఇచ్చారు
– పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు..
– రాహుల్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు

ఢిల్లీ, నేషనల్​ బ్యూరో: అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మణిపూర్​ ను దేశం నుంచి ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. రాహుల్​ గాంధీ లోక్​ సభలో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్​ కిస్​ ఇచ్చారని ఆరోపించారు. గతంలో ఏ ఎంపీ కూడా ఇలా చేయలేదని ఫైర్​ అయ్యారు. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. లోక్​ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన అనంతరం స్మృతీ ఇరానీ కౌంటర్​ ఇచ్చారు. ‘మీరు ఇండియా (ప్రతిపక్షాల కూటమిని ఉద్దేశించి) కాదు. ఇండియాలో అవినీతి ఉండదు. ఇండియా మెరిట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తుంది. వారసత్వాన్ని కాదు’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా క్విట్ ఇండియా (భారత్‌ను వీడండి) ప్రస్తావన తీసుకొచ్చారు. అవినీతి.. భారత్‌ను వీడాలి, వారసత్వం.. భారత్‌ను వీడాలి వంటి పదాలను ఉపయోగించారు. అలాగే మణిపుర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

‘మణిపుర్ దేశంలో భాగం.. దానిని ఎవరూ విడదీయలేరు. భారత మాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారు. దేశంలో అవినీతిని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీనే. యూపీఏ హయాంలో మహిళలపై ఎన్నో అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. రాజస్థాన్‌లో బాలికపై గ్యాంగ్ రేప్‌ చేసి.. ముక్కలుగా నరికేశారు. కశ్మీర్‌ పండితులు, మహిళలపై జరిగిన అన్యాయాలు రాహుల్‌కు కనిపించవా..? వాటిని ఒక సినిమాలో చూపిస్తే.. కాంగ్రెస్ నేతలు దాన్నొక ప్రచారమని అన్నారు. వారే ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు’ అని ఘాటుగా బదులిచ్చారు.

Recent

- Advertisment -spot_img