Manoj Kumar : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ (Manoj Kumar) ఈరోజు కన్నుమూశారు. మనోజ్ కుమార్ 87 సంవత్సరాల వయసులో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించారు. 1957లో ‘ఫ్యాషన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ కుమార్ 1999లో నటన నుండి రిటైర్ అయ్యారు. ఎక్కువగా దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో ఆయన పేరు ‘భరత్‌కుమార్’గా మారిపోయింది. అమితాబ్ బచ్చన్ హీరోగా మనోజ్ తెరకెక్కించిన ”రోటీ కపడా ఔర్ మకాన్” అనే సినిమా 1974లోనే అతిపెద్ద విజయం సాధించింది. ఆయన భారతీయ సినిమా మరియు కళలకు చేసిన కృషికి గాను 2015లో భారత ప్రభుత్వం నుండి 1992లో జాతీయ చలనచిత్ర పురస్కారం మరియు పద్మశ్రీ పురస్కారాలను మరియు సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.