పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడు యోగేశ్ కతునియా డిస్కస్ త్రో (F56)లో 42.22 మీటర్ల త్రోతో మరోసారి సిల్వర్ సొంతం చేసుకున్నారు. ఈ పారాలింపిక్స్‌లో ఇండియా ఇప్పటివరకు ఒక గోల్డ్, 3 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో 30వ స్థానంలో ఉంది. చైనా, బ్రిటన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.