Homeహైదరాబాద్latest Newsఅవినీతికి అడ్డగా మంథని లేబర్ కార్యాలయం

అవినీతికి అడ్డగా మంథని లేబర్ కార్యాలయం

ఇదేనిజం, మంథని : మంథని లేబర్ అధికారి కార్యాలయంపై విజిలెన్స్ విచారణ జరపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెంకల సురేశ్​ కోరారు. లేబర్ ఆఫీస్ పరిధిలో లేబర్ కార్డు మంజూరు, కార్డుదారులకు లబ్దిని మంజూరు చేసే ప్రక్రియలో లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అడిగినంత డబ్బులిస్తే చాలు అర్హులు కాకున్నా లేబర్ కార్డు మంజూరు జారీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కార్డుల మంజూరు వ్యవహారంలో అనేక అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. మంథనిలోని ఏఎల్​వో కార్యాలయంలో లేబర్ కార్డు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా దర్జాగా కొనసాగుతుందన్నారు. ఇతర దళారులను ఏర్పరచుకొని అందులో ఒక దళారి ఆన్​ లైన్​ సెంటర్ ద్వారానే లేబర్ కార్డు, లేబర్ కార్డుపై వచ్చే పెళ్లి కానుక, డెత్ క్లైములు వీటిపై ఏది ముందుకు సాగాలన్న కూడా ఆన్​లైన్​ సెంటర్ ద్వారా వస్తేనే ఫైలు ముందుకు కదుతుందని, లేకుంటే లబ్ధిదారుడు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా మోక్షం లభించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లేబర్​అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img