పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్‌కు మరో పతకం చేజారింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో ఆమెకు మూడో పతకం చేజారినట్లైంది. ఇప్పటికే మను ఖాతాలో రెండు పతకాలు ఉన్నాయి. ముందుగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను బాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మరో షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి మహిళా అథ్లెట్‌గా మను బాకర్ నిలిచింది.