పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను భాకర్ చరిత్ర సృష్టించారు. దీంతో ఆమె ఇమేజ్‌ను వాడుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఒలింపిక్స్ మెడలిస్ట్‌తో ప్రకటనల కోసం దాదాపు 40 బ్రాండ్స్ ఆమె టీమ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగిందని, గతంలో రూ.20 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.1.5 కోట్లకు పెరిగినట్లు తెలుస్తుంది.