భారత యువ షూటర్ మను భాకర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పతక రౌండ్‌కు అర్హత సాధించడంతో ఆమె మూడవ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌లో మను బాకర్ గెలిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ విజయాలు సాధించే అవకాశం ఉంటుంది.